ఈరోజు ఎందుకో ఆదివారం ప్రామాణిక సమయం కంటే ఒక గంట ఆలస్యం గా నిద్రలేచాను
సండే ఫీస్ట్ కి లేట్ అయిపోతుంది..ఎలాగోలా స్నానం చేసేసి వెళ్ళే సరికి మొత్తం ఆలయ ప్రాంగణం అంతా నిండి పోయి ఉంది..
అర్రెర్రే ఏమిటి ఇంత ఆలస్యం జరిగిపోయిందా వెళ్ళడం కూర్చోడానికి అసలు స్థలమే లేదు..LCD స్క్రీన్ ముందు వేరే హాల్ లో కూర్చోండి అని ప్రభూ జీ పంపిస్తుండగా ఫోన్ మోగింది
నా ఫోన్ కాదు ఒక భక్తుని ది వెంటనే షార్ప్ గా కేచ్ చేసి నేను అతని ప్లేస్ లో కూర్చున్నా
అరగంట సేపు కీర్తనం చేసేసరికి ఈ ఆదివారానికి ఒకతను వచ్చి addressing place లో ఆసీనులయ్యాక నా కళ్ళతో నేనే నమ్మలేకపోయాను
The Journey Home రచయత రాధానాద్ స్వామి మా అందరి ముందు రెండు గంటల సేపు అధ్బుతమైన ప్రసంగాన్ని చేసి ముగించాక
వావ్! ఇతన్ని చూడాలనుకొని ఎన్ని రోజులనుండి ఎదురుచూస్తున్నా.చూడడం కంటే తన ప్రసంగం మరింత ఆకట్టుకుంది
భోజనం చేసి కృష్ణున్ని మరో సారి దర్శించుకోవడానికి ఖాళీ గా ఉన్న ముందు వరుస లో కృష్ణుని ఎదురుగా కూర్చొని తన్మయత్వం తో నేను కీర్తిస్తుంటే ప్రక్కనే కాసేపటికి ఇంకెవరో సాష్టాంగ నమస్కారం చేసి నా ప్రక్కన కూర్చున్నారు He is so humble and ecstatic love for the god appear on his face.
హరే కృష్ణ! నా ప్రక్కనే రాధానాథ్ స్వామి తన చిరునవ్వు ను చెదరకుండా నవ్వుతూ ఆశీర్వదించి వెంటనే వెళ్ళి పోయారు.
What a day అని గట్టిగా అనుకొని
నేను రూమ్ కి వచ్చేసా.
ఈ రోజు దర్శన చిత్రాలు..
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే